Eamcet Ecet Results : తెలంగాణ ఎంసెట్ ఈసెట్ ఫలితాలు విడుదల..

Eamcet Ecet Results : తెలంగాణ ఎంసెట్ ఈసెట్ ఫలితాలు విడుదల..
X
Eamcet Ecet Results : తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

Eamcet Ecet Results : తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన లోహిత్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించగా, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నక్కా సాయి దీప్తిక రెండో ర్యాంకు, పొలిశెట్టి కార్తికేయ మూడో ర్యాంకు సాధించారు. ఇక అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో నేహ మొదటి ర్యాంకు సాధించగా, రోహిత్‌ రెండో ర్యాంకు, తరుణ్‌ మూడో ర్యాంకు సాధించారు.

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలకు లక్షా 56వేల మంది హాజరయ్యారన్నారు. వీరిలో లక్షా 26వేల మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అగ్రికల్చర్‌, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94వేల 476 మంది దరఖాస్తు చేసుకోగా 80వేల 575 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారన్నారు. వీరిలో 71వేల 180 మంది అర్హత సాధించారన్నారు. త్వరలోనే కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు.

Tags

Next Story