Telangana Exit Poll Result 2023: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్..కాంగ్రెస్‌కు అనుకూలమా ?

రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్... అధికారంలోకి వచ్చే అవకాశముందని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. 60 స్థానాలకుపైనే హస్తం పార్టీ సాధించే అవకాశం ఉన్నట్లు దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. భారాస ప్రతిపక్ష పాత్రకే.. పరిమితం కావొచ్చని పేర్కొన్నాయి. మూడు, నాలుగో స్థానాల్లో భాజపా, MIM నిలొవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని..మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్‌కు 62 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశముందని.. టుడేస్ చాణక్య అంచనా వేసింది. భారాసకు 24 నుంచి 42 స్థానాలు, భాజపాకు 2 నుంచి 12, MIM 5 నుంచి 7 సీట్లు, ఇతరులు ఒకటి నుంచి రెండు సీట్లు గెలుస్తాయని.. టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిడ్జ్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ 58 నుంచి 68చోట్ల, భారాస 46 నుంచి 56 స్థానాల్లో గెలుస్తాయని వెల్లడించింది. భాజపా 4 నుంచి 9 స్థానాల్లో, MIM 5 నుంచి 7 సీట్లలో విజయం సాధించే అవకాశముందని పేర్కొంది. కాంగ్రెస్ 57చోట్ల గెలిచే అవకాశం ఉందని సీ ఓటర్ అంచనా వేసింది. భారాస 46, భాజపా 9, MIM 7 స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ప్రకారం.. భారాస 31 నుంచి 47 చోట్ల, కాంగ్రెస్ 63 నుంచి 79 స్థానాల్లో విజయం సాధిస్తాయి. భాజపా 2 నుంచి 4, MIM 5 నుంచి 7స్థానాల్లో గెలుస్తాయని.. అంచనా వేసింది. భారాస 35 నుంచి 46, కాంగ్రెస్ 62 నుంచి 72 సీట్లలో విజయం సాధించే అవకాశముందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్స్ తెలిపింది. భాజపా3 నుంచి 8 స్థానాలు, MIM 6 నుంచి 7, ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాల్లో.. గెలుస్తాయని అంచనా వేసింది. భారాస 45 నుంచి 51, కాంగ్రెస్ 57 నుంచి 67 చోట్ల గెలుస్తాయని.. రేస్ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించింది. భాజపా ఒకటి నుంచి 5 స్థానాల్లో.... MIM 5 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని.... పేర్కొంది. భారాస 40 నుంచి 55, కాంగ్రెస్ 48 నుంచి 64 చోట్ల విజయం సాధిస్తాయని జన్‌కీ బాత్ అంచనా వేసింది. భాజపా 7 నుంచి 13, MIM 4 నుంచి 7 స్థానాల్లో గెలుస్తాయని పేర్కొంది. భారాస 22 నుంచి 31 నియోజకవర్గాల్లో.. కాంగ్రెస్ 67 నుంచి 78స్థానాల్లో గెలిచే అవకాశముందని..చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించింది. భాజపా 6 నుంచి 9, MIM 6 నుంచి 7 చోట్ల గెలిచే అవకాశముందని తెలిపింది.
కాంగ్రెస్‌కు 56 నుంచి 61 స్థానాలు వచ్చే అవకాశముందని.. రాజనీతి అంచనా వేసింది. భారాసకు 45 నుంచి 50 స్థానాలు, భాజపాకు 6 నుంచి 9, MIM 6 నుంచి 7 సీట్లు వస్తాయని రాజనీతి ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. అధికార భారాసకు 58 నుంచి 63 స్థానాలు వస్తాయని ఆత్మసాక్షి అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 48 నుంచి 51, భాజపాకు 7 నుంచి 8, ఎంఐఎం, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు వస్తాయని ఆత్మసాక్షి ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించింది. అధికార భారాసకు 58నుంచి 63 స్థానాల్లో గెలుపు ఖాయమని ఆరా అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 58 నుంచి 67, భాజపాకు 7 నుంచి 8, ఎంఐఎం, ఇతరులకు కలిపి 7 నుంచి 9 సీట్లు వస్తాయని ఆరా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com