తెలంగాణ

KCR : తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌ ఫ్లెక్సీలకు పాలాభిషేకం..!

KCR : సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు, ఫ్లెక్సీలకు తెలంగాణ వ్యాప్తంగా క్షీరాభిలేకాలు, ధాన్య తులాభారాలు జరుగుతున్నాయి.

KCR :  తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌ ఫ్లెక్సీలకు పాలాభిషేకం..!
X

KCR : కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయంగా వడ్లను కొనుగోలు చేస్తామన్న ప్రకటనతో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు, ఫ్లెక్సీలకు తెలంగాణ వ్యాప్తంగా క్షీరాభిలేకాలు, ధాన్య తులాభారాలు జరుగుతున్నాయి. పలు కోట్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు.. కేసీఆర్‌ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో మంత్రి నిరంజన్‌ రెడ్డితో కలిసి హరీష్‌ రావు... కేసీఆర్‌ ఫ్లెక్సీలకు పాలాభిషేకం, ధాన్యాభిషేకం చేశారు మంత్రులు. దేశంలో ఎక్కడా లేని సమస్యను తెలంగాణలో కేంద్రం సృష్టిస్తుందని మండిపడ్డారు హరీష్‌ రావు. కేంద్రం మొండి వైఖరితో రైతులు నష్టపోతారని రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

ఖమ్మంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ క్షీరాభిషేకం చేశారు. రైతులకు స్వీట్లు పంచిపెట్టారు.ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు వెన్నుపోటు పొడిచిందని, కేసీఆర్‌ మాత్రం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు.భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్‌ కటౌట్‌కు వడ్లతో తులాభారం నిర్వహించారు వరంగల్‌ టీఆర్‌ఎస్ నేతలు. వరంగల్ చౌరస్తాలో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు నేతృత్వంలో వినూత్న పద్దతిలో కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.హైదరాబాద్‌ శివార్లలోని శంషాబాద్‌ లో చేవెళ్ల ఎంపీ రంజీత్‌ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌.. కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

కరీంనగర్‌లో రైతులు తమ పొలాల్లోనే మంత్రి గంగుల కమలాకర్‌, సీఎం కేసీఆర్‌ భారీ కటౌట్లను ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. వాటికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌ మెయిన్‌ సెంటర్‌లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇన్నాళ్లు ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు... ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందన్న ప్రకటనతో సంబరాలు చేసుకున్నారు.

Next Story

RELATED STORIES