Telangana: ఫామ్‌హౌస్‌ డీల్‌ కేసు.. పోలీసుల ఎంక్వైరీ మొదలు

Telangana: ఫామ్‌హౌస్‌ డీల్‌ కేసు.. పోలీసుల ఎంక్వైరీ మొదలు
Telangana: ఫామ్‌హౌస్‌ డీల్‌ కేసుపై మొయినాబాద్‌ పోలీసులు దూకుడు పెంచబోతున్నారు.

Telangana: ఫామ్‌హౌస్‌ డీల్‌ కేసుపై మొయినాబాద్‌ పోలీసులు దూకుడు పెంచబోతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో.. పోలీసుల ఎంక్వైరీ మొదలుపెట్టనున్నారు.


ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. త్వరలోనే నిందితులను సైతం కస్టడీలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కస్టడీ కోసం మొయినాబాద్ పోలీసులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అక్కడ వాదనల తర్వాత 14 రోజుల కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణను హైకోర్టు 18వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు బీజేపీ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారని, దీనిపై లోతైన విచారణ చేపట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.


దీంతో కేసును పోలీసులు కాకుండా ప్రత్యేక దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. మరోవైపు రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదని తెలంగాణ ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశిస్తేనే సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫామ్‌హౌస్‌ డీల్‌ కేసులో ముగ్గురు నిందితులు జైలులోనే ఉన్నారు.

మరోవైపు నిందితుడు రామచంద్ర భారతిపై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రామచంద్ర భారతికి ఒకటికి మించి పాన్‌, ఆధార్‌ కార్డులు ఉన్నాయని, కార్డుల్లో నంబర్ ఒకటే ఉన్నా.. తండ్రి పేరు, పుట్టిన తేదీ వేర్వేరుగా ఉన్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే రామచంద్ర భారతిపై బంజారాహిల్స్‌ పోలీసులు ఐపీసీ 467, 468, 420, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు పైనా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story