కరోనాతో పోరాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు మృతి!

కరోనాతో పోరాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు మృతి!
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు బూర్గుల నర్సింగ్ రావు (89) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు బూర్గుల నర్సింగ్ రావు (89) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు సమీప బంధువైన ఈయన.. నిజాం కాలేజీలో చదువుకున్నారు. హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ తరఫున రజాకార్లపై పోరాడిన నర్సింగ్ రావు AISF జాతీయాధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన మృతి పట్ల వామపక్ష నేతలు సంతాపం తెలిపారు. నర్సింగరావు అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం 12 .30 గంటలకు జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి.

బూర్గుల నర్సింగరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లోనూ నర్సింగ రావు పాత్ర మరువలేనిదని సీఎం అన్నారు. ఎన్నో కమ్యూనిస్టు, ప్రగతిశీల ఉద్యమాలను బూర్గుల నర్సింగరావు ముందుండి నడిపించారని సీఎం కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story