TS: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఖాతాల్లోకి రూ. లక్ష?

TS: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఖాతాల్లోకి రూ. లక్ష?
X
పునాదీ వరకు నిర్మాణం పూర్తయ్యాకే జమ... త్వరలోనే కేటాయింపులు షురూ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో 4.5 లక్షల మందిని ఎంపిక చేస్తారని.. లబ్ధిదారుల జాబితా ఫైనల్ కాగానే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని సమాచారం. మొదట లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున జమ అవుతాయని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్త షరతులు విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఇళ్లు మంజూరైన 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభం కాకపోతే.. ఇళ్లు రద్దు చేస్తామని ప్రకటించబోతోందని తెలుస్తోంది. దీంతో అంత తొందరగా డబ్బులు ఎక్కడినుంచి తేవాలని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాని కోరుతున్నారు.

నియోజకవర్గానికి వెయి ఇండ్లు..!

కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో 71,482 ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు వస్తాయని మంత్రులు చెబుతున్నారు. తొలి విడతలో 21 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఇండ్లు ఇవ్వనుంది. అత్యధికంగా ఒక్క హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోనే 2,528 ఇళ్లను ప్రభుత్వం అందించనుంది. పెద్దపల్లిలో 1,198 ఇందిరమ్మ ఇండ్లు, కోదాడలో 1,152 ఇండ్లు అందించనుంది.

నిబంధనలు ఇవే..

  1. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ యాప్‌ సర్వే చేసిన సమయంలోచూపిన సొంత స్థలం ప్రాంతంలో లబ్ధిదారుడే ముగ్గు పోసుకోవాలి. మరోచోట ఇల్లు కట్టుకుంటే వారికి ఇందిరమ్మ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు.
  2. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందించాలి. గ్రామ కార్యదర్శి అక్కడికి వచ్చి పరిశీలించి, ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్‌ సైతం చేస్తారు.
  3. కనీసం 400 చదరపు అడుగులు కంటే తక్కువ కాకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది.
  4. ఇంటి పునాది పూర్తి చేస్తేనే మొదటి విడతలో భాగంగా రూ.1 లక్షను లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు
  5. .లబ్ధిదారులకు ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించనున్నారు. ఇసుకకు సంబంధించిన కూపన్లను ఎమ్మార్వో గానీ, లేక ఆర్డీవోల ద్వారా లబ్ధిదారులకు అందించనున్నారు.

Tags

Next Story