TG: తెలంగాణలో క్రీడా విశ్వ విద్యాలయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయించింది. హకీంపేట లేదా గచ్చిబౌలిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదించింది. స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైన్స్ సహా 12 కోర్సులను ఈ విశ్వ విద్యాలయంలో అందించాలని నిర్ణయించింది. ఇటీవల దక్షిణకొరియాలోని సియోల్‌లో రేవంత్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు. తెలంగాణలో భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లను సిద్ధం చేసేందుకు ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలోని స్పోర్ట్స్ హబ్‌లో దీన్ని ఏర్పాటుచేస్తారు. దాదాపు 200 ఎకరాల్లో స్థాపించనున్న వర్సిటీలో డజనుకుపైగా స్పోర్ట్స్ అకాడమీలు రానున్నాయి. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతోపాటు స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. దీనికి అనువైన స్థలం కోసం హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్, గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్నారు.
ఇటీవల దక్షిణకొరియా పర్యటనకు వెళ్లినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి సియోల్‌లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు. 1976లో ప్రారంభించిన ఈ వర్సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాత క్రీడావర్సిటీగా నిలిచింది. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో దక్షిణకొరియా 32 పతకాలు సాధించగా.. వాటిలో 16 పతకాలు కొరియన్ క్రీడావర్సిటీ క్రీడాకారులే తెచ్చారు. 2028లో లాస్‌ఏంజెలిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో మన దేశ పనితీరు మెరుగు పరిచేందుకు, తెలంగాణలో స్థాపించనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీలో ఉండాల్సిన మౌలిక వసతులపై సూచనలు ఇవ్వాలని, సహాయ సహకారాలు అందించాలని మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. దేశానికి ఒలింపిక్స్ పతకాలు తెచ్చిన క్రీడాకారులను అభినందిస్తున్నానని..య. కానీ, దేశాల వారీగా ర్యాంకులను చూసినప్పుడు కొంత బాధ కలుగుతోందని రేవంత్ అన్నారు. క్రీడలపై ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసిందని... ప్రోత్సాహకాలు ఇస్తోందన్నారు. సదుపాయాలు పెరిగాయని,,. ప్రైవేటు సంస్థలూ ముందుకొచ్చాయన్నారు.
జాతీయ ఆలోచనా విధానం మారినప్పుడు ఒలింపిక్స్‌లో ప్రపంచాన్ని ఓడించే ప్రతిభను ఈ భూమి మీద ఏది అడ్డుకుంటోందని అంటూ ఆవేదన వ్యక్తంచేస్తూ ఆనంద్ మహీంద్రా శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆయన పోస్టుకు రీపోస్టు చేశారు. ‘‘మీ ఆవేదనలో దేశంపై ప్రేమ, యువతపై అపార నమ్మకం కనిపిస్తోందని రేవంత్ అన్నారు. తాను వ్యక్తిగతంగా ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నా. కానీ, ఇదే విషయాన్ని దేశ యువత తెలుసుకోవాలనుకుంటోందన్నారు. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలపై పనిచేస్తున్నానని. ఇటీవల దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లినప్పుడు కొరియా నేషనల్ స్పోర్ట్స్ వర్సిటీ అధ్యక్షుడు మూన్ వోన్‌జే బృందాన్ని కలిశా. హైదరాబాద్‌లో క్రీడా వర్సిటీ ఏర్పాటుకు భాగస్వామిగా ఉండేందుకు కొరియా వర్సిటీ అంగీకరించిందన్నారు. ఈ పర్యటన ఆగస్టు 13న జరిగితే... గడిచిన 72 గంటల్లోనే హకీంపేట, గచ్చిబౌలిలోని 200 ఎకరాల క్యాంపస్‌లతోపాటు అన్ని క్రీడా స్టేడియాల్లో మౌలిక సదుపాయాలను ఒలింపిక్స్ గ్రేడ్‌కు సమానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com