TS: అన్నదాతలకు అండగా మరో పథకం

వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మారిన సాగు పద్ధతులు, కాడెద్దులు తగ్గిపోవడం, కూలీల కొరత, పెట్టుబడి కూడా ఎక్కువవడంతో రైతులు పంటల సాగు కోసం యంత్రాలను వాడటం తప్పనిసరిగా మారింది. కానీ ఐదేళ్ల క్రితం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిలిపివేసింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నా, మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయక పోవడంతో పథకం అమలు కావడం లేదు. దీంతో రైతులకు సాగు భారంగా మారింది. మళ్లీ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు పునరుద్ధరించనున్నట్లు ప్రకటించడం రైతులకు ఊరటనిస్తోంది. పంట దిగుబడి పెంచేలా ప్రభుత్వం అన్నదాతలకు అధునాతమైన యంత్ర పరికరాలు అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది.
యాసంగి నుంచే...
యాసంగి పంట కాలం నుంచే రైతులకు 50 శాతం రాయితీపై పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. కొన్నేళ్లుగా ఈపథకం నిలిచిపోవడంతో రైతులు పంటదిగుబడికి ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ హయాంతో ఇలాంటి సమస్యలు ఉండకూడదని నిర్ణయించారు. కాగా, ఈ స్కీమ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 26 కోట్లు కేటాయించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 20 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా నేరుగా వ్యవసాయ శాఖ నుంచే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. తంలో ఆగ్రోస్ ద్వారా ఈ పరికరాలు పంపిణీ చేసేవారు. దీని ద్వారా అర్హులకు కాకుండా పెద్ద భూస్వాములకు ప్రయోజనం చేకూరిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో యాంత్రీకరణ పరికరాల పంపిణీ బాధ్యతలు వ్యవసాయ శాఖకే అప్పగించాలని నిర్ణయించారు.
తప్పనిసరిగా మారిన యంత్రాల వినియోగం
కూలీల కొరతకు తోడు కూలి రేట్లు పెరగడంతో రైతులు వ్యవసాయానికి యంత్రాలను వినియోగిం చడం తప్పనిసరిగా మారింది. కానీ ప్రభుత్వం రాయి తీపై యంత్ర పరికరాలను అందించడం లేదు. దీంతో అద్దెకు తీసుకోవాల్సి రావడం ఆర్థిక భారం అవుతోంది. రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు, యంత్రా లను అందిస్తే పెట్టుబడి ఖర్చు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వ్యవసాయ యాంత్రీ కరణ పథకాన్ని పునరుద్ధరించినట్లు ఇటీవల వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com