TS DSC: షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ

తెలంగాణలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఉద్యోగార్థులు కోరుతున్న వేళ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జులై 8న ప్రకటన విడుదలే చేసింది. డీఎస్సీ పరీక్షలను యథాతథంగా జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు జులై 11న సాయంత్రం 5 గంటల నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవవచ్చని పేర్కొంది. తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ జూన్ 28న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.
టీఎస్ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలు ఇలా.
జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష
జులై 24న స్కూల్ అసిస్టెంట్ - బయలాజికల్ సైన్స్ పరీక్ష
జులై 25న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు
జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష.
ఆగస్టు 5 వరకు మిగతా పరీక్షలను నిర్వహించనున్నారు.
డీఎస్సీ పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయడంతోపాటు 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో టెట్ నిర్వహించిన వెంటనే.. డీఎస్సీ నిర్వహిస్తున్నారని, రెండు పరీక్షల సిలబస్ వేర్వేరు కాబట్టి డీఎస్సీకి ప్రిపరేషన్‌కు సమయం కావాలని వారు కోరుతున్నారు. అభ్యర్థుల అందోళనను ప్రభుత్వం లెక్కచేయలేదు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయడానికి అంగీకరించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com