TG: తెలంగాణలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నేడు (శుక్రవారం) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.
మన్మోహన్‌సింగ్ కన్నుమూత
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ ఎయిమ్స్‌లో చేరారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. దీనికి ముందు, ఆయన భారతదేశానికి ఆర్థిక మంత్రి , ఆర్థిక కార్యదర్శిగా కూడా ఉన్నారు. పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com