RATION CARDS: జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ

RATION CARDS: జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ
X
తుది జాబితా సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం... కొత్తగా 3 లక్షల రేషన్ కార్డులు సిద్ధం

జనవరి 26 నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షురూ అవ్వనుంది. ఇప్పటికే గ్రామాల్లో లబ్ధిదారులకు సంబంధించిన జాబితాలు అందుబాటులో ఉంచారు. రేషన్‌కార్డుల ఫైనల్‌ లిస్ట్‌ను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేశారు. తొలి విడతలో కొత్తగా 3 లక్షల రేషన్‌కార్డులను తెలంగాణ ప్రభుత్వం జారీచేసింది. ప్రజాపాలన దరఖాస్తులను కూడా గ్రామసభలో నిర్ధారించి రేషన్‌ కార్డులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రకటన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రభుత్వం నుంచి ఏ చిన్న పథకం పొందాలన్నా రేషన్ కార్డే ప్రామాణికంగా ఉంది. పేదలకు గుర్తింపు కార్డుగా మారిన రేషన్‌ కార్డులను దాదాపు దశాబ్దకాలం పాటు కేసీఆర్ సర్కార్ అందజేయలేదు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయబోతోంది. జిల్లా కలెక్టర్లు ఖారారు చేసిన జాబితా ప్రకారం పౌరసరఫరాల శాఖ కార్డులను మంజూరు చేయనుంది.

వడబోత తర్వాతే రేషన్‌ కార్డులు

తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ఆధారం. దీంతో రేషన్‌కార్డుకు డిమాండ్‌ బాగా పెరిగింది. గతంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుని పరిశీలించే వారు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తోంది. గత నవంబరులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఎంపిక ఉండనుంది.

6.68 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు

తెలంగాణలో పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా పౌరసరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారు కానుంది.

కొత్త రేషన్ కార్డులపై స్పష్టత

తెలంగాణలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పాత రేషన్ కార్డులు తొలగిస్తామని జరుగుతోన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు. పాత రేషన్ కార్డులు అలాగే ఉంటాయని క్లియర్ కట్‌గా చెప్పేశారు. దరఖాస్తు పెట్టుకున్నట్లయితే పాత రేషన్‌ కార్డుల్లో… కొత్తవారిని కూడా చేరుస్తామని కూడా వివరణ ఇచ్చారు. ఇటవల చేసిన క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ ఆధారంగానే రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం ప్రకటిస్తున్న జాబితాల్లో పేర్లు లేకపోతే టెన్షన్ పడొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామ సభల్లో మళ్లీ అప్లై చేసుకోవచ్చని సూచించారు.

Tags

Next Story