RATION CARDS: మీసేవలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటివరకూ కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుని దానిని అమలులోకి తెచ్చింది. ఇప్పటికే లబ్ధిదారులుగా భావిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే రేషన్ కార్డులు లేని కారణంగా పథకాలకు దూరం అవుతున్నామని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వారికి ఊరట కలిగించే వార్త చెప్పింది. రేషన్ కార్డుల కోసం అర్హులైన వారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
లబ్ధిదారుల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని పౌరసరఫరాలశాఖ మీ సేవ కమిషనర్‌కు సూచించింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా డిమాండ్ ఉంది. జనవరి 26న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ ప్రారంభించింది. పలు గ్రామాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు జారీ చేసింది. రేషన్ కార్డులు లేని కుటుంబాలు చాలానే ఉన్నాయని, కార్డు లేని కారణంగా తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని, పలు విధాలుగా నష్టపోతున్నామని పేద, మధ్యతరగతి వారు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట లభించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com