TG: రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. . గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారి నుంచి ఆప్షన్ తీసుకొని వారిని ‘‘గ్రామ పాలన అధికారి’’గా నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే ఇతర శాఖల్లో వీలినమైన వీఆర్వోలు, వీఆర్‌ఏల నుంచి రెవెన్యూ శాఖ ఆప్షన్స్ తీసుకున్నది. ఇందులో 7 వేల లోపే జీపీవోలుగా చేసేందుకు ముందుకు వచ్చారు.
రాత పరీక్షతో పోస్టుల భర్తీ!
గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 1,000 సర్వేయర్లు, 10,954 గ్రామ పాలనాధికారి(GPO) పోస్టులను మంజూరు చేసింది. వీటికి పూర్వ VRA, VROల నుంచి 9,654 దరఖాస్తులు రాగా.. ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు 6వేల మంది ఉన్నారు. ఎలాంటి పరీక్ష లేకుండా తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. రాత పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీళ్ల ద్వారా దాదాపు 6 వేల వరకు పోస్టులు భర్తీ అవుతాయని తెలిసింది. ఇక మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ద్వారా తీసుకోనున్నట్టు సెక్రటేరియేట్వర్గాలు వెల్లడించాయి.
నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఉగాది నుంచి అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి కార్యాచరణ రూపొందించారు. మొత్తం 61,579 పోస్టుల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం, ఉగాది తర్వాత వారం లేదా పది రోజుల్లో 55,418 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 58,868 పోస్టులను భర్తీ చేసిన ఈ ప్రభుత్వం, తాజాగా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలతో కలిపి 57,924 పోస్టులను పూర్తి చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com