TS: క్రీడా రంగానికి రేవంత్ సర్కార్ ఊతం

TS: క్రీడా రంగానికి రేవంత్ సర్కార్ ఊతం
X
ఆస్ట్రేలియాకు ప్రత్యేక బృందం... క్రీడా విశ్వవిద్యాలయం కోసం 700 ఎకరాలు కేటాయింపు

తెలంగాణలో క్రీడా రంగానికి ఊతం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. అందుకోసం ఓ బృందాన్ని అధ్యయనం కోసం ఆస్ట్రేలియాకు పంపించింది. ఆస్ట్రేలియాలో క్రీడాకారులకు ఆర్థిక సహకారంతో పాటు అత్యాధునిక శిక్షణ ఇస్తోందని అధ్యయనానికి వెళ్లిన క్రీడా బృందం గుర్తించింది. తెలంగాణ యువత కూడా క్రీడల వైపు మొగ్గు చూపులే మరిన్ని ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగానే ప్రత్యేక క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఫోర్త్‌ సిటీలో క్రీడా విద్యాలయం ఏర్పాటుకు 700 ఎకరాలను ఇప్పటికే కేటాయించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్​కుమార్​గౌడ్, రాష్ట్ర స్పోర్ట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి నేతృత్వంలో క్రీడల బృందం ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆస్త్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర రాజధానిగా గుర్తింపు పొందిన మెల్‌బోర్న్‌ను క్రీడా బృందం ఇప్పటికే సందర్శించింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు జితేందర్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ ఎండీ సోనీ బాల, హాకీ ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ మహ్మద్‌ ఫహీమ్‌ ఖురేషి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఈ భేటీలో పాల్గొని క్రీడా నైపుణ్యంపై చర్చించారు.

ఫోర్త్ సిటీలో స్పోర్ట్స్ హబ్

హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించ‌నున్న ఫోర్త్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ హబ్‌లో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో సుమారు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తారు. ఈ స్పోర్ట్స్ హబ్ లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఉండేలా ఏర్పాట్లు చేస్తారు.

ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాలు

కొత్తగా స్థాపించిన స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీకి “యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ” అనే పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాంపస్ ను ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలుండేలా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి ఇటీవల దక్షిణ కొరియాలో పర్యటించిన‌ప్పుడు సియోల్ లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని ని సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్ యూనివర్సిటీ గా ప్రత్యేకత చాటుకుంది.

Tags

Next Story