కొత్త రకం కరోనాతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

కొత్త రకం కరోనాతో ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికే బ్రిటన్ ఈ కొత్త వైరస్‌తో అతలాకుతలమైయింది. సాధారణ కరోనాతో పొలిస్తే ఈ కొత్త వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. యూఏలో ఈ కొత్త వైరస్ విజృంభించడంతో మిగిలి దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. యూకేపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. అటు వివిధ దేశాలు మరోసారి లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. కరోనాతో అల్లకల్లోలమైన ఇటలీ పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియంలోనూ లాక్‌డౌన్ విధించారు.
బ్రిటన్ నుంచి కొత్త రకం వైరస్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చినవారిపై నిఘా ఉంచింది. యూకే నుంచి నిన్న కేవలం ఏడుగురే వచ్చారని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు వారం రోజుల్లో హైదరాబాద్‌కు 358మంది వచ్చినట్లు తెలిపారు. అందరికి ఆర్‌టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త వైరస్ వల్ల పెద్దగా ప్రమాదం లేకపోయినా ఈ వైరస్ ఎక్కువమందికి సోకే అవకాశాలున్నాట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, ౩ కోట్ల డోసులు భద్రపరిచేలా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com