Telangana Government : తెలంగాణలో పెరిగిన సినిమా టిక్కెట్ల ధరలు.. !

Telangana Government : తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏసీ థియేటర్లలో కనిష్ట టికెట్ ధర 50 రూపాయలు కాగా.. గరిష్ట టికెట్ ధర 150 రూపాయలుగా ఉంది. మల్టీప్లెక్స్‌ల్లో కనిష్టంగా 100, గరిష్టంగా 250 రూపాయలు ఉంది. మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్ సీట్లకు గరిష్టంగా 300 రూపాయలు వసూలు చేయనున్నారు. టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనంగా ఉండనున్నాయి. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లలో టికెట్‌పై 5 రూపాయలు.. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్‌పై 3 వసూలు వసూలు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పట్ల తెలుగు సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com