Telangana government : న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించిన తెలంగాణ ప్రభుత్వం..!

Telangana government : న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించిన తెలంగాణ ప్రభుత్వం..!
Telangana government : కొవిడ్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించింది

Telangana government : కొవిడ్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీవో జారీ చేసింది. ఇక నేటి నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, జనవరి 2, 2022 వరకు కొనసాగుతాయని ప్రభుత్వ జీవోలో పేర్కొంది. వేడుకలు జరిగే ప్రదేశాల్లో ప్రధాన ద్వారం దగ్గర.. థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇతర కార్యక్రమాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేసింది. మాస్క్‌ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story