Telangana Government : ఉద్యోగాల నోటిఫికేషన్లకు కేసీఆర్ సర్కారు రెడీ

KCR (tv5news.in)
Telangana Government : తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లకు రెడీ అవుతోంది కేసీఆర్ సర్కారు. సీఎం ఆదేశించడమే తర్వాయి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. 80వేల ఉద్యోగాలిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఆఘమేఘాల మీద... భర్తీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు అధికారులు. ఇప్పటికే సీఎంకు నివేదిక అందజేసింది ఆర్థిక శాఖ.
అటు... శాఖల వారీగా నియామకాల ప్రక్రియ చేపట్టనుంది. రిజర్వేషన్లు, రోస్టర్ల విధానం డిసైడ్ చేయనున్నాయి శాఖలు. ఆ తర్వాత.. రిక్రూట్ మెంట్ బోర్డులకు ప్రతిపాదనలు పంపనున్నాయి. రిక్రూట్‌మెంట్ బోర్డులు ఉన్న పోలీస్, పంచాయతీ, విద్య, వైద్య శాఖలలో నియమకాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనుంది టీఎస్పీఎస్సీ.
ప్రస్తుతం హోంశాఖలో 18వేల 334 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 13వేల 86 పోస్టులు, వైద్య ఆరోగ్యశాఖలో 12వేల 755 పోస్టులు, ఉన్నత విద్యలో 7వేల878 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖలో 4 వేల 311 పోస్టులకు నోటిఫికేషన్లకు రెడీ అవుతోంది తెలంగాణ సర్కారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com