దళిత బంధు పథకం : తొలివిడతగా 500 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..!

X
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అమలుకు నిధులు మంజూరు చేసింది. తొలివిడతగా 500 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత బడ్జెట్‌లో దళిత సాధికారతకు కేటాయించిన వెయ్యికోట్ల నుంచి ఈ నిధులను కేటాయించారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో దళిత బంధు అమలు చేయనున్న సర్కారు.. ఇందు కోసం 20 వేల 929 కుటుంబాలను ఎంపిక చేసింది. మొదటి దశలో ఐదువేల కుటుంబాలకు 10 లక్షల చొప్పున తెలంగాణ సర్కారు పంపిణీ చేయనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
