Tamilisai Soundararajan : సరూర్‌నగర్‌లో జరిగిన హత్యపై స్పందించిన గవర్నర్ తమిళ సై

Tamilisai Soundararajan : హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన హత్యపై తెలంగాణ గవర్నర్ తమిళసై స్పందించారు. నాగరాజు దారుణ హత్యపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించారు. మతాంతర వివాహం కాబట్టి.... ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు గవర్నర్ తమిళసై.
వికారాబాద్ జిల్లా స్టేషన్ మరపల్లికిచెందిన నాగరాజు సరూర్ నగర్‌లోని ఓ కార్లషోరూమ్‌లో సేల్స్ మేన్‌గా పనిచేస్తున్నాడు. అతను సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అనే యువతిని ప్రేమించి జనవరిలో ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. ఈ ప్రేమపెళ్లి ఇష్టంలేని యువతి కుటుంబసభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అదే సమయంలో తనకు రక్షణ కావాలంటూ నాగరాజు పోలీసులను కూడా కోరారు. అయితే నాగరాజుపై కక్షపెంచుకున్న సుల్తానా కుటుంబీకులు హత్యకు ప్లాన్ వేశారు.
బుధవారం రాత్రి 9 గంటల సమయంలో నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా బైక్ వెళ్తుండగా... సరూర్‌నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర్లో వీరిని అడ్డగించి నాగరాజు పై ఇనుపరాడ్‌తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నాగరాజు...భార్య సుల్తానా కళ్లముందే ప్రాణాలు వదిలాడు. రోడ్డుపై జనం చూస్తుండగానే ఈ దాడి జరిగింది. ఈ ఘటన తీవ్రకలకలం రేపింది. ఇప్పుడు ఈ హత్యపై ఏకంగా తెలంగాణ సర్కారును గవర్నర్ నివేదిక కోరడం ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com