TG: భూమి లేని పేదలకు రూ. 12 వేలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూమి లేని పేదలకు రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించింది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28న ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఏడాదిలో 2 విడతలుగా అందించే ఈ డబ్బులో తొలి విడతగా రూ.6 వేల మొత్తాన్ని ఆ రోజున లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణలో దాదాపు 50 లక్షలకు పైగా భూమి లేని కుటుంబాలు ఉండగా వారికి సంవత్సరానికి రూ.12,000 వేలు చొప్పున రెండు విడతల్లో ఇవ్వనున్నారు. దాదాపు 5 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రైతులకు, వ్యవసాయం కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు
తెలంగాణ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల మంజూరుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు.. మంత్రివర్గం నిర్ణయించింది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సుమారు ఐదు గంటలకు పైగా జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఐదు ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. ముఖ్యంగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వటంపై చర్చించిన కేబినెట్.. కీలక నిర్ణయం తీసుకుంది. గతకొంతకాలంగా చెప్తూ వస్తున్నట్టుగానే.. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి పండుగకు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
కేటీఆర్ అరెస్టు తథ్యమేనా..?
కేటీఆర్ ఈ-ఫార్ములా రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది. కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందనడం వారి అహంకారపురిత మాటలకు నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంగా విమర్శలు చేయడంలో తప్పు లేదన్నారు. కక్ష పూరితంగా కాంగ్రెస్ వ్యవహరించడం లేదని.. తప్పులను బయటకు తీసి చర్చలో పెట్టామని మంత్రి పేర్కొ్న్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై కూడా చర్యలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com