Dharani Portal: నేటి నుంచి పది రోజులపాటూ ‘ధరణి’ స్పెషల్ డ్రైవర్

ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకుnతెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండలస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. నేటి నుంచి 9వ తేదీలోగాన్ పెండింగ్ సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచనలకు అనుగుణంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్‌మిత్తల్ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు అన్నిస్థాయిల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని వాటి వివరాలు కంప్యూటర్లలో నమోదుచేయాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరిస్తే అందుకు కారణాలను భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టంచేశారు. నాలుగు రకాల మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లు పరిష్కరిస్తారు. సేత్వార్, ఖాస్రా పహాణీ, ఇతర మూలపత్రాలను పరిశీలించి క్షేత్రస్థాయి విచారణలు జోడించి సమస్యలు పరిష్కరించనున్నారు. అసైన్డ్ భూములతోపాటు.. అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు GPA, SPA, ఎగ్జిక్యూటెడ్ జీపీఏ దరఖాస్తులు సహా భూ సమస్యలకు సంబంధించిన వినతులను తహసీల్దార్ స్థాయిలో పరిష్కరిస్తారు. రెండు, మూడు ఖాతాలు నమోదై ఉంటే కలపడం వంటివి చేయాలని ప్రభుత్వం తెలిపింది.
6 రకాల మాడ్యూళ్లలో వచ్చిన దరఖాస్తులనుఆర్డీవో స్థాయిలో పరిష్కరించనున్నారు. దరఖాస్తులను తప్పనిసరిగా తహసీల్దార్లకు పంపించి విచారణ నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుంది. పాస్ పుస్తకాలు లేకుండా వ్యవసాయేతర భూములుగా నమోదైనవి భూ సేకరణకు చెందిన సమస్యలు ప్రవాసీయులకు చెందిన భూసమస్యలు, సంస్థల పేరిట పాసుపుస్తకాలు, కోర్టు కేసులు పాస్‌పుస్తకాల్లో తప్పులు నమోదై ఉంటే RDO స్థాయిలో పరిష్కరించనున్నారు. మూల విలువ 5 లక్షల లోపు ఉన్న భూములకు చెందిన గల్లంతైన సర్వే నంబర్లు, సబ్ డివిజన్ సర్వే నంబర్లు విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరిస్తారని సర్కారు పేర్కొంది. RDOల విచారణ తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యలనుకలెక్టర్లు పరిష్కరించనున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ నిర్వహించిఆర్డీవోలకు నివేదిక ఇవ్వాలి. RDOలు తప్పనిసరిగా రెవెన్యూ మూలదస్త్రాల పరిశీలన చేపట్టాలని, ఒకవేళ తిరస్కరిస్తే దరఖాస్తులకు సరైన కారణాన్ని తెలియజేయాలని పేర్కొంది. 7 రకాల మాడ్యూళ్లకు కలెక్టర్లే తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తహసీల్దార్లు, RDO స్థాయిలో విచారణ చేసిన తర్వాతే.. చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. యాజమాన్య హక్కుల బదిలీ- మ్యుటేషన్ అసైన్డ్ భూములతోపాటు వారసత్వ బదిలీకి సంబంధించి పాసుపుస్తకాలు లేనివి నిషేధిత జాబితాలోని భూముల దరఖాస్తులను కలెక్టర్ స్థాయిలో పరిష్కరిస్తారు. సెమీఅర్బన్ భూములు, కోర్టు కేసులు-పాసుపుస్తకాలు ఇళ్లు లేదా ఇంటిస్థలాలను వ్యవసాయేతర భూములుగా మార్పిడి, పాసుపుస్తకాల్లో సవరణలు, పేరు, ధరణికి ముందు కొంత భూమిని చదరపు గజాల లెక్కన విక్రయించినవి వ్యవసాయ భూమిగా వ్యవసాయేతర భూమి మార్పు, మిస్సింగ్ సర్వే నంబర్లు, సబ్ డివిజన్ నంబర్ల దస్త్రాలను, కలెక్టర్ల స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుందని పేర్కొంది. మూల విలువ 5 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉన్నభూమికి సంబంధించి విస్తీర్ణంలో సవరణలు చేస్తారని వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com