ఘనంగా మంత్రి హరీష్‌రావు పుట్టిన రోజు వేడుకలు

నేడు తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అధికారులు, అభిమానులు.. సేవా కార్యక్రమాలతో పాటు మొక్కలు నాటుతూ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోఠిలోని TSMSIDC, DH కార్యాలయ ఆవరణలో అధికారులు మొక్కలు నాటారు. ఇందులో TSMSIDC ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, DME రమేష్ రెడ్డి, వివిధ విభాగాల HODలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
వైద్యారోగ్యశాఖ మంత్రిగా హరీష్ రావు ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు డీహెచ్ శ్రీనివాస్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్న వ్యక్తి మంత్రి హరీష్ రావు అని కొనియాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ సర్వీసులు అందిస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాలు పూర్తిగా అమలు చేస్తున్న వ్యక్తి మంత్రి హరీష్ రావు అన్నారు TSMSIDC ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్ వదిలి,.. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కృషి వల్లే అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com