అంతా తావీజ్ మహిమ..! తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను కాపాడింది డాక్టర్లు, వైద్య సేవలు కాదని తాయత్తు మాత్రమేనని డీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తావీజు మహిమ ఎంతో శక్తివంతంగా ఉంటుందని.. తాను ప్రత్యక్షంగా దాన్ని అనుభవించానని చెప్పారు డీహెచ్. రంజాన్ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెంలో జీఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డీహెచ్ శ్రీనివాసరావు ఇఫ్తార్ విందు ఇచ్చారు. అనంతరం తన గతాన్ని గుర్తు చేసారు. తాను పుట్టినపుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నానని తెలిపారు. మరణం తధ్యం అనుకుంటున్న సమయంలో మౌల్వీ వద్ద తావీదు కట్టిచ్చారని చెప్పారు. తనకు అల్లా, భగవంతుని దయ, శక్తి ఉందన్నారు. ముస్లింల కుటుంబసభ్యుడిగా ఉంటానని.. ముస్లింలు తనను ఆదరించాలన్న డీహెచ్.. కొత్తగూడెంకు కొత్త నాయకత్వం అవసరం ఉందని స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com