Telangana High court : లాక్ డౌన్ నిర్ణయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సడన్ గా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఎలా అని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల ప్రజలు తమ సొంత ప్రాంతాలకు ఎలా వెళతారని అడిగింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు ప్రభుత్వానికి కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేదని.. సడన్ గా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఎలా అని ప్రశ్నించింది. ఇక అటు సరిహద్దులో నలభై నుంచి యాభై అంబులెన్సులు నిరీక్షిస్తున్నాయని హైకోర్టు తెలిపింది. అంబులెన్స్ లకి అనుమతికి రేపటిలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలపగా... రేపటి లోపు అంతమంది ప్రాణాలు కోల్పోవాలా అని హైకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్ లో అంతర్జాతీయ మెడికల్ వసతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తారని తెలిపింది. లాక్ డౌన్ లో సాయింత్రం ఏమైనా సడలింపు ఉందా అని హైకోర్టు ప్రశ్నించగా.. ఎలాంటి సడలింపు లేదని ప్రభుత్వం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com