Bandi Sanjay: తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్‌కు ఊరట.. వ్యక్తిగత పూచీకత్తుపై..

Bandi Sanjay (tv5news.in)
Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన రిమాండ్ కొట్టేసిన హైకోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు జైళ్ల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బండి సంజయ్ రిమాండ్‌పై స్టే విధించిన ఉన్నత న్యాయస్థానం.. పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బండి సంజయ్ పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.
ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో ఆయనతో పాటు 16 మందిపై 8 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు కరీంనగర్ పోలీసులు. సంజయ్ సహా ఆరుగురిని ఈ నెల 2వ తేదీన అరెస్టు చేశారు. ఆ తర్వాతి రోజు కోర్టులో హాజరుపరిచారు. వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో బండి సంజయ్ రిలీజ్ కానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com