GROUP1: గ్రూప్ 1 ఫలితాల ప్రకటనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

GROUP1: గ్రూప్ 1 ఫలితాల ప్రకటనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X
గ్రూప్ 1 పరీక్ష ఫలితాలపై దాఖలైన పిటిషన్లన్నీ కొట్టివేత

గ్రూప్‌-1 పరీక్షపై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిజర్వేషన్లు తేలేంతవరకు గ్రూప్‌-1 ఫలితాలు ప్రకటించవద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేసింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలను పూర్తి చేసింది. రిజర్వేషన్ల విషయం తేలేంతవరకు గ్రూపు 1 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గ్రూప్‌-1పరీక్షలపై వచ్చిన అభ్యంతరాలకు అర్థం లేదని హైకోర్టులో అభిప్రాయపడింది. రిజల్ట్స్ ఆపాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణ జరిగింది. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులకు రిజల్ట్స్ ప్రకటనపై ఉత్కంఠ వీడింది..

గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్‌

తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆన్సర్ కీ తోపాటు పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పరీక్షకు హాజరైన లక్షల మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. కటాఫ్ మార్కులతో కూడిన జాబితాను డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. గ్రూప్-3లో 1388 పోస్టుల భర్తీ కోసం కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ను టీజీపీఎస్సీ 2024ని నవంబర్ 17,18న విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా పరీక్ష ఫలితాలు, స్కోర్‌కార్డ్‌లు, కటాఫ్ మార్కులతో సహా డిసెంబర్ 30లోపు అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచనుంది.

Tags

Next Story