Restrictions On Pubs: పబ్బుల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Restrictions On Pubs: ఇళ్ల మధ్య పబ్‌ల ఏర్పాటుపై దాఖలైన పిటీషన్ విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు పబ్‌ల నిర్వాహకులకు కీలక సూచనలు చేసింది. పబ్బులు ముందు హెచ్చరిక బోర్డ్‌లు పెట్టాలని ఆదేశించింది. తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులదే బాధ్యతని స్పష్టం చేసింది. శబ్ద కాలుష్యం 45 డెసిబుల్స్‌కి మించరాదని ఆదేశించింది. పబ్బులకు వెళ్లే జంటలతో వచ్చే మైనర్లకు అనుమతి నిరాకరించాలని ఆదేశించింది.
ఎక్సైజ్ శాఖ ను సైతం ప్రతివాదులుగా చేరుస్తామని తెలిపింది. వేడుకలు ముగిసిన తరువాత పరిణామాలు, పోలీసులు నివేదికల.. ఆధారంగా ఆదేశాలు ఇస్తామని తెలిపింది హైకోర్టు. జనవరి 4 వ తేదీ ఉదయం వరకు ఆంక్షలు అమలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. హైదరాబాద్ పోలీసులు ఊహించిన దాని కంటే.. ఎక్కువగా చర్యలు తీసుకున్నట్లు అభిప్రాయపడింది హైకోర్టు. తదుపరి విచారణ జనవరి 6కి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com