Telangana High Court: గ్రూప్‌-1 పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Telangana High Court:  గ్రూప్‌-1 పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X
అన్ని పిటిషన్లను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు... ఈనెల 21నుంచి పరీక్షలు

గ్రూప్‌-1 పరీక్షలకు అడ్డంకి తొలగింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్‌ పరీక్ష జరగనుంది. కాగా, ఇప్పటికే పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

హాల్‌టికెట్లు విడుదల..

తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దాదాపు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మెయిన్స్ రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ నుంచిహాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. ఈ పరీక్షలు హైదరాబాద్‌ పరిధిలో జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కొన్ని గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. తొలిరోజు తీసుకెళ్లిన హాల్ టిక్కెట్‌నే మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకెళ్లాలని.. రోజుకో కొత్త హాల్ టిక్కెట్‌తో వెళితే ఇన్విజిలేటర్లు అనుమతించరని టీజీపీఎస్సీ స్పష్టంగా పేర్కొంది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ప్రతిపరీక్ష రోజు హాల్ టిక్కెట్‌పై తప్పనిసరిగా సంతకం చేయాలని TGPSC తెలిపింది. అలాగే.. గ్రూప్‌-1 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి అయ్యేవరకు హాల్‌ టికెట్లను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టిక్కెట్‌తో పాటు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్, బ్లాక్‌ లేదా బ్లూ బాల్ పాయింట్ కలిగి ఉండాలి. కాగా.. గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాలకు జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. జులై 7న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

Tags

Next Story