వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు.. !

వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులు రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యనించింది. విచారణకు పది నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్‌ఎంసీపై అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరికే లేదా అంటూ ఆగ్రహించింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని, జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని ప్రశ్నించింది హైకోర్టు. జీహెచ్‌ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లోనూ నిమజ్జనం ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని, లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని తెలిపింది. అయితే... సలహాలు కాదని.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలంది హైకోర్టు. నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణలపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది తెలంగాణ హైకోర్టు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com