వామన్ రావు దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు : హైకోర్టు

వామన్ రావు దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు : హైకోర్టు
లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.

లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. హత్య కేసును హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తోందని సీజే ధర్మాసనం తెలిపింది. వామన్ రావు తండ్రికి ఎంత బాధ ఉందో., ఈ కోర్టుకు అంతే ఉందని ధర్మాసనం తెలిపింది. పోలీసుల దర్యాప్తు ఇప్పటివరకు సరైన దిశలోనే సాగుతోందన్న హైకోర్టు.. ఈ సమయంలో సీబీఐకి అప్పగిస్తే సమయం వృధా అవుతుందని అభిప్రాయపడింది. విచారణలో భాగంగా దర్యాప్తుపై నివేదికను ఏజీ కోర్టుకు సమర్పించారు.

నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని.. ఇప్పటివరకు 25 మంది సాక్షులను విచారించామని పోలీసులు తెలిపారు. కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామన్నారు. బిట్టు శీను, లచ్చయ్య వాంగ్మూలాల నమోదు కోసం కోర్టులో దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. కుంట శీను, చిరంజీవిలను సాక్షులు గుర్తించే ప్రక్రియ పూర్తి చేశామన్నారు.

సిసీ టీవీ, మొబైల్ దృశ్యాలను ఎఫ్ఎస్ఎల్ కి పంపించామని..నిందితులు వాడిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రత్యక్ష సాక్షులకు పోలీసులు భద్రత కల్పించారని.. కొందరు సాక్షులు భద్రతను నిరాకరించారన్నారు. మూడు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను గుర్తిస్తున్నామని తెలిపారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ముగ్గురు ప్రయాణికుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామన్నారు. ఏడవ నిందితుడిని కూడా అరెస్ట్ చేశామన్నారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదావేసింది.

Tags

Read MoreRead Less
Next Story