లోన్ యాప్‌లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోండి : తెలంగాణ హైకోర్టు

లోన్ యాప్‌లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.. లోన్ యాప్‌లను తొలగించేందుకు ప్లే స్టోర్‌ను సంప్రదించాలని డీజీపీకి సూచించింది. న్యాయవాది కల్యాణ్ దీప్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. చైనా లోన్ యాప్‌ల వల్ల బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. దీనిపై సీరియస్ అయిన ధర్మాసనం రుణ యాప్‌ల వేధింపులపై నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది.రుణ అప్లికేషన్ల నిర్వాహకులను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కూడా నివేదికలు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com