New Year Celebrations: పబ్‌ల్లో న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

New Year Celebrations: పబ్‌ల్లో న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
X
New Year Celebrations: పబ్‌లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

New Year Celebrations: పబ్‌లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లో ఇళ్ల మధ్య పబ్‌లు తొలగించాలన్న పిటీషన్‌పై విచారణ జరిగింది. పబ్‌ల వల్ల శబ్ధ కాలుష్యం, ప్రమాదాలు పెరుగుతున్నాయని పిటిషనర్‌ తెలిపారు. వాదనల అనంతరం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం మార్గదర్శకాల మేరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

యువతను దృష్టిలో ఉంచుకుని పబ్‌లపై చర్యలుండాలని ఆదేశించింది. కేవలం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు సరిపోతాయా అని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు అడిషనల్‌ ఏజీ. న్యూ ఇయర్‌ వేడుకల్లోపే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో రేపు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags

Next Story