ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచండి : తెలంగాణ హైకోర్టు

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచండి :  తెలంగాణ హైకోర్టు
రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పైన తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదికపైన హైకోర్టు పలు సూచనలు చేసింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పైన తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదికపైన హైకోర్టు పలు సూచనలు చేసింది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ మాత్రమే కాకుండా సాంఘిక సమావేశాలను, అన్ని గ్యాదరింగ్ లను 50 శాతానికి కుదించాలని సూచించింది. 108, 104 కు ఫోన్ కాల్స్ అధికమవుతున్నాయి. ఇది కరోనా తీవ్రతకి అద్దం పడుతుందని పేర్కొంది. అంబులెన్స్ డ్రైవర్ లను, ఆసుపత్రి సిబ్బందిని చేతివాటం ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇక సరైన సంఖ్యలో శవాలను తరలించడానికి సంచులను ఏర్పాటు చేయాలనీ కోరింది. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులలో అన్నీ RTPCR టెస్టులకి వేచి చూడకుండా వైద్యం అందించాలని సూచించింది.ప్రభుత్వం సరైనా సమాచారంతో అఫిడవిట్ ని ఫైల్ చేయాలనీ హితవు పలికింది. వృద్ధులకి, వికలాంగులకి సరైనా వైద్య సదుపాయం అందేలా చూడాలని పేర్కొంది. కాగా సుమోటో కోవిడ్ కేసును వచ్చేవారానికి వాయిదా వేసింది. అటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచాలంటూ ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story