Telangana: ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయో పరిమితి పెంపునకు ఉత్తర్వులు జారీ..

Telangana: ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయో పరిమితి పెంపునకు ఉత్తర్వులు జారీ..
X
Telangana: ఉద్యోగ నియమాకాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

Telangana: ఉద్యోగ నియమాకాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్...వయో పరిమితిని కూడా పెంచుతామన్నారు. ఇందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయో పరిమితిని పదేళ్ల పాటు పెంచింది. దీంతో 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయస్సు 44 ఏళ్లకు పెరిగింది. గరిష్ట వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తించనుంది. ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే యూనిఫాం సర్వీసుకు మాత్రం గరిష్ట వయోపరిమితి వర్తించదు.

Tags

Next Story