TG: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపింది. జనవరి 29న ఇంటర్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉంటుందన్నారు. జనవరి 30న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఉంటుందని తెలిపింది.
ఇంటర్ మొదటి సంవత్సరం..
05-03-2025 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
07-03-2025 - ఇంగ్లిష్ పేపర్-1
11-03-2025 - గణితం పేపర్-1ఏ; బోటనీ పేపర్-1; పొలిటికల్ సైన్స్ పేపర్-1
13-03-2025 - గణితం పేపర్ -2బి; జువాలజీ పేపర్-1; హిస్టరీ పేపర్-1
17-03-2025 - ఫిజిక్స్ పేపర్-1; ఎకనామిక్స్ పేపర్-1
19-03-2025 - కెమిస్ట్రీ పేపర్-1; కామర్స్ పేపర్-1
21-03-2025 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1; బ్రిడ్జ్ కోర్సు గణితం పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)
24-03-2025 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1; జాగ్రఫీ పేపర్-1
ఇంటర్ ద్వితీయ సంవత్సరం
06-03-2025 - సెంకడ్ లాంగ్వేజ్ పేపర్-2
10-03-2025 - ఇంగ్లిష్ పేపర్-2
12-03-2025 - గణితం పేపర్-2ఏ; బోటనీ పేపర్-2; పొలిటికల్ సైన్స్ పేపర్-2
15-03-2025 - గణితం పేపర్ -2బి; జువాలజీ పేపర్-2; హిస్టరీ పేపర్-2
18-03-2025 - ఫిజిక్స్ పేపర్-2; ఎకనామిక్స్ పేపర్-2
20-03-2025 - కెమిస్ట్రీ పేపర్-2; కామర్స్ పేపర్-2
22-03-2025 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2; బ్రిడ్జ్ కోర్సు గణితం పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు)
25-03-2025 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2; జాగ్రఫీ పేపర్-2
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com