Telangana: తెలంగాణలో మరో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు.. రూ. 1000 కోట్ల పెట్టుబడితో..

Telangana: తెలంగాణలో కొత్తగా రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది. వెయ్యికోట్లతో పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు దావోస్‌లో.. మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది స్టాడ్లర్ కంపెనీ. తెలంగాణలో ఉన్న మేథో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ కలి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి.
తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు కంపెనీ ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం మేరకు రెండేళ్లలో.. వెయ్యి కోట్ల రూపాయలను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం స్టాడ్లర్ రైల్ కంపెనీ పెట్టుబడిగా పెట్టనుంది. ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారు చేసే రైల్వేకోచ్‌లను కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ఏషియా పసిఫిక్ రీజియన్ కోసం ఎగుమంతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. రైల్వేకోచ్ ఏర్పాటు కోసం ముందుకొచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com