TELANGANA: పాత రి­జ­ర్వే­ష­న్ల­తో­నే స్థా­నిక ఎన్ని­క­లు

TELANGANA: పాత రి­జ­ర్వే­ష­న్ల­తో­నే స్థా­నిక ఎన్ని­క­లు
X

తె­లం­గా­ణ­లో 42 శాతం బీసీ రి­జ­ర్వే­ష­న్ల అమలు జీ­వో­పై సు­ప్రీం­కో­ర్టు­లో తె­లం­గాణ ప్ర­భు­త్వా­ని­కి బిగ్ షాక్ తగి­లిం­ది. అత్యు­న్నత న్యా­య­స్థా­నం స్పె­ష­ల్ లీవ్ పి­టి­ష­న్‌­ను వి­చా­రిం­చేం­దు­కు ని­రా­క­రి­స్తూ డి­స్మి­స్ చే­సిం­ది. హై­కో­ర్టు­లో ఈ అంశం పెం­డిం­గ్‌­లో ఉన్నం­దున వి­చా­ర­ణ­కు స్వీ­క­రిం­చ­లే­మ­ని తే­ల్చి చె­ప్పిం­ది. కా­వా­ల­ను­కుం­టే పాత రి­జ­ర్వే­ష­న్ల­తో స్థా­నిక ఎన్ని­క­ల­కు వె­ళ్ల­వ­చ్చ­ని పే­ర్కొం­ది. స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో బీసీ జనా­భా­కు అను­గు­ణం­గా రి­జ­ర్వే­ష­న్ల­ను 42 శా­తా­ని­కి పెం­చు­తూ జీవో నం­బ­ర్ 9ను జారీ చే­సిం­ది. అయి­తే, ఈ జీ­వో­పై కొం­ద­రు వ్య­క్తు­లు హై­కో­ర్టు­ను ఆశ్ర­యిం­చ­గా, రి­జ­ర్వే­ష­న్లు 50 శాతం పరి­మి­తి­ని మిం­చి ఉన్నా­య­ని అలా­గే సు­ప్రీం­కో­ర్టు ని­ర్దే­శిం­చిన 'ట్రి­పు­ల్ టె­స్ట్' (వె­ను­క­బా­టు­త­నం, జనా­భా వి­వ­రా­లు, 50 శాతం పరి­మి­తి) ప్ర­మా­ణా­ల­ను పా­టిం­చ­లే­ద­నే కా­ర­ణం­తో హై­కో­ర్టు దీ­ని­పై స్టే వి­ధిం­చిం­ది. హై­కో­ర్టు స్టే కా­ర­ణం­గా రా­ష్ట్రం­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­కల ప్ర­క్రియ ని­లి­చి­పో­యిం­ది. హై­కో­ర్టు ని­ర్ణ­యా­న్ని సవా­లు చే­స్తూ.. జీవో నం­బ­ర్ 9 ఆధా­రం­గా స్థా­నిక ఎన్ని­క­ల­కు అను­మ­తి ఇవ్వా­ల­ని కో­రు­తూ తె­లం­గాణ ప్ర­భు­త్వం సు­ప్రీం­కో­ర్టు­లో స్పె­ష­ల్ లీవ్ పి­టి­ష­న్ దా­ఖ­లు చే­సిం­ది. ప్ర­భు­త్వం తర­పున సు­ప్రీం కో­ర్టు సీ­ని­య­ర్ న్యా­య­వా­ది అభి­షే­క్ సిం­ఘ్వీ వా­ద­న­లు వి­ని­పిం­చా­రు.

బలంగా వాదనలు

వా­ద­ల­ను వి­న్న జస్టి­స్ వి­క్ర­మ్ నాథ్, జస్టి­స్ సం­దీ­ప్ మె­హ­తా ధర్మా­స­నం కీలక ఆదే­శా­లు జారీ చే­సిం­ది. రి­జ­ర్వే­ష­న్ల వి­ష­యం­లో సు­ప్రీం­కో­ర్టు మా­ర్గ­ద­ర్శ­కా­ల­ను పు­న­రు­ద్ఘా­టి­స్తూ.. 50 శాతం రి­జ­ర్వే­ష­న్ల పరి­మి­తి­కి లో­బ­డి మా­త్ర­మే ఎన్ని­క­ల­కు వె­ళ్లా­ల­ని సర్వో­న్నత న్యా­య­స్థా­నం తె­లం­గాణ ప్ర­భు­త్వా­ని­కి స్ప­ష్టం చే­సిం­ది. ఇప్ప­టి­కే ఈ వ్య­వ­హా­రం­పై హై­కో­ర్టు­లో వి­చా­రణ జర­గు­తు­న్న వి­ష­యా­న్ని గు­ర్తు చే­సిం­ది. బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు అమలు చే­యా­లం­టూ ప్ర­భు­త్వం దా­ఖ­లు చే­సిన స్పె­ష­ల్ లీవ్ పి­టి­ష­న్‌­ను ధర్మా­స­నం కొ­ట్టి­వే­సిం­ది. ప్ర­స్తుత పరి­స్థి­తు­ల్లో తాము జో­క్యం చే­సు­కో­లే­మ­ని సు­ప్రీం కో­ర్టు స్ప­ష్టం చే­సిం­ది. అభి­షే­క్ సిం­ఘ్వీ వా­ద­న­లు వి­ని­పిం­చా­రు. ఈ అం­శం­పై తక్ష­ణ­మే జో­క్యం చే­సు­కో­వా­ల­ని న్యా­య­స్థా­నా­న్ని కో­రా­రు. రి­జ­ర్వే­ష­న్లు 50శాతం మిం­చొ­ద్ద­నే అభి­ప్రా­యం సరి­కా­ద­ని కో­ర్టు­కు వి­వ­రిం­చా­రు. ఇం­ది­రా సహా­నీ కే­సు­లో­నూ 50శాతం పర­మి­తి దా­టొ­చ్చ­ని ఉం­ద­ని గు­ర్తు చే­శా­రు. ఇం­టిం­టి సర్వే చేసి లె­క్క తే­ల్చిం­ద­ని సిం­ఘ్వీ న్యా­య­స్థా­నా­ని­కి వి­వ­రిం­చా­రు. సర్వే­లో పా­ర­ద­ర్శ­కత పా­టిం­చా­మ­ని వె­ల్ల­డిం­చా­రు.

Tags

Next Story