TG: తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ హోరాహోరీ
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. మెుత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ సాగిందని తెలిపింది. అధికార కాంగ్రెస్‌కు 7 నుంచి 9సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్.... అంచనా వేసింది. బీజేపీ 6 నుంచి 8, బీఆర్‌ఎస్ ఒకచోట గెలిచే అవకాశం ఉందని తెలిపింది. MIM ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడించింది. ఇండియా టీవీ సర్వేలో బీజేపీ 8 నుంచి పది, కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్‌ఎస్, MIM ఒక్కోచోట గెలిచే అవకాశముందని పేర్కొంది. జన్ కీ బాత్ సర్వేలో బీజేపీ 9 నుంచి 12, కాంగ్రెస్ 4 నుంచి 7, భారాస..... ఒకచోట గెలుస్తుందని అంచనావేసింది. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ సర్వేలో బీజేపీ 8 నుంచి పది, కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్‌ఎస్, మజ్లిస్ ఒక్కోచోట గెలుస్తాయని తేల్చింది. ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్, బీజేపీలు 7 నుంచి 9స్థానాల చొప్పున గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాదని, మజ్లిస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని అంచనావేసింది. న్యూస్-18 సర్వేలో......... బీజేపీకు 7 నుంచి 10, కాంగ్రెస్ 5 నుంచి 8, బీఆర్‌ఎస్‌కు 2 నుంచి 5, మజ్లిస్ ఒక్కచోటగెలిచే అవకాశం ఉందని తేలింది. టుడేస్ చాణక్య సర్వేలో బీజేపీ పది నుంచి 14, కాంగ్రెస్ 3-7 గెలుస్తాయని తేలింది. మజ్లిస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని, బీఆర్‌ఎస్ సున్నానుంచి ఒక సీటు వస్తుందని అంచనావేసింది.
ఏపీలో ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన.. కూటమికే ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. ఈసారి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కూటమి గెలవనున్నట్లు చెప్పాయి. కూటమి 17 నుంచి 20 స్థానాల్లో గెలవనున్నట్లు రైజ్ సంస్థ అంచనా వేసింది. వైసీపీ 7 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది. పీపుల్స్ పల్స్ సంస్థ... తెలుగుదేశం 13 నుంచి 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. వైసీపీ 3 నుంచి 5, బీజేపీ 2 నుంచి 4, జనసేన 2 స్థానాలు వస్తాయని పేర్కొంది. పయనీర్ సంస్థ కూటమికి 20 పైగా స్థానాలు వస్తాయని అంచనావేసింది. అదే వైసీపీ ఐదుస్థానాలకు పరిమితమవుతుందని చెప్పింది. కేకే సర్వేస్... తెలుగుదేశం17,బీజేపీ 6,జనసేన 2 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. వైసీపీ కు సున్నా వస్తాయని వెల్లడించింది ఇండియా టీవీ తెలుగుదేశం 13 నుంచి 15 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని తెలిపింది. వైసీపీ 3 నుంచి 5 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. జనసేన 2, బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో విజయం సాధిస్తాయని పేర్కొంది. సీఎన్‌ఎక్స్ సంస్థ తెలుగుదేశం 13 నుంచి 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వైసీపీ 3 నుంచి 5, జనసేన 2, బీజేపీకు 4 నుంచి 6 స్థానాలు వస్తాయని వెల్లడించింది. అటు ఇండియా న్యూస్-డీ-డైనమిక్స్ కూటమికి 18 పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. వైసీపీ కు 7 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. జన్‌కీబాత్ వైసీపీ 10 నుంచి 14 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని వెల్లడించింది. కూటమి 8 నుంచి 13 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. టైమ్స్‌నౌ వైసీపీ కు 13 నుంచి 15 స్థానాలు వస్తాయని వెల్లడించింది. తెలుగుదేశం 7 నుంచి 9, బీజేపీ 2, జనసేన ఒక్క స్థానంలో విజయం సాధిస్తాయని పేర్కొంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com