Chandranna: తెలంగాణ మావోయిస్టు కమిటీ సారథి చంద్రన్న?

Chandranna: తెలంగాణ మావోయిస్టు కమిటీ సారథి చంద్రన్న?
Chandranna: తెలంగాణ మావోయిస్టు కమిటీ సారథిని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. సంవత్సర కాలంగా ఖాళీగా ఉంటున్న పదవీలో కొత్త బాసును నియమించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Chandranna: తెలంగాణ మావోయిస్టు కమిటీ సారథిని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. సంవత్సర కాలంగా ఖాళీగా ఉంటున్న పదవీలో కొత్త బాసును నియమించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతేడాది జూన్‌లో రాష్ట్ర కమిటీ అప్పటి కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ కరోనాతో మరణించాడు.

అప్పటి నుంచి పూర్తిస్థాయి బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. రాష్ట్ర కమిటీ సభ్యుడు చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ తాత్కాలికంగా బాధ్యతలు చూసుకునేవారు. తాజాగా సారథ్యం బాధ్యతలను ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్నకే అప్పగించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్‌ గ్రామానికి చెందిన చంద్రన్న 1980లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. కొంతకాలం ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పనిచేసిన తర్వాత దండకారణ్యానికి వెళ్లిపోయారు. సుదీర్ఘకాలం అక్కడే ఉండి పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఏర్పాటుతో కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో పనిచేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో దండకారణ్యంలో పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ సారథి అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో దామోదర్‌తో పాటు బండి ప్రకాశ్‌ అలియాస్‌ ప్రభాత్‌, మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌, కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతానికి చంద్రన్న సారథ్యంలోనే కార్యకలాపాలు సాగించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది.

Tags

Next Story