కొడుకు విజయం.. తండ్రి ఆనందం

కొడుకు విజయం.. తండ్రి ఆనందం
బిడ్డలు బాగా చదువుకొని పైకొస్తే తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది

బిడ్డలు బాగా చదువుకొని పైకొస్తే తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది. అందుకు తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా మినహాయింపు కాదు. తన కొడుకు ఆర్చిష్మాన్ రావు అమెరికాలోని కొలరాడో యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. దీంతో తండ్రి తనయుడిని కౌగలించుకుని ఆనందం వ్యక్తం చేశారు.

ఆర్చిష్మాన్ యూనివర్సిటీ నుంచి గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కుటుంబ సమేతంగా హాజరై తన కుమారుడిని అభినందించారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో వెల్లడించి హర్షం వ్యక్తం చేశారు. అతడు సాధించిన అద్భుత విజయాన్ని చూసి గర్వపడుతున్నా. అతడి పట్టుదల, సాధించాలనే తపనకు ఇది నిదర్శనమని అన్నారు. తన నైపుణ్యంతో ప్రపంచంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించగలడని ట్విట్టర్‌లో ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Next Story