ఏపీ సీఎంకు కేటీఆర్ విషెస్.. ప్రజా సేవలో జీవితాంతం..

ఏపీ సీఎంకు కేటీఆర్ విషెస్.. ప్రజా సేవలో జీవితాంతం..
X
మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి. ప్రజా సేవలో జీవితాంతం కొనసాగాలి అన్నా' అని..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన కేటీఆర్.. జగన్‌ని ఉద్దేశిస్తూ.. గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. 'మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి. ప్రజా సేవలో జీవితాంతం కొనసాగాలి అన్నా' అని ట్వీట్ చేశారు. కేటీఆర్‌తో పాటు తెలంగాణ నుంచి పలువురు ప్రముఖులు జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

కేటీఆర్ సీఎం జగన్‌ను అన్నా అని సంభోధించడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పులివెందులలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు.

సోషల్ మీడియాలో జగన్ మోహన్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


Wishing a very happy birthday to Hon'ble CM of AP Sri @ysjagan Garu

Tags

Next Story