Minister KTR : ఐటీలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోన్న తెలంగాణపై కేంద్రం వివక్ష: కేటీఆర్

KTR (tv5news.in)
X

KTR (tv5news.in)

Minister KTR : కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

Minister KTR : కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఎస్టీపీఐల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన లేఖలో ఆరోపించారు. కేంద్రం కొత్తగా 22 సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు ప్రకటించినా తెలంగాణకు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కును ఒక్కటీ కేటాయించలేదని విమర్శించారు. కేంద్ర వివక్షపూరిత వైఖరికి ఎస్టీపీఐ ఇవ్వకపోవడమే నిదర్శనమని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీఐఆర్ రద్దు చేసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఐటీలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై కేంద్రం వివక్ష తగదన్నారు.

Tags

Next Story