CM Breakfast Scheme : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహారం

CM Breakfast Scheme : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహారం
మెనూ ఎలా ఉందో తెలుసా?

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా కేసీఅర్ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మధ్యాహ్నం భోజనం ద్వారా విద్యార్థుల కడుపునింపుతున్న సర్కారు ఉదయం పూట అల్పాహారం అందించేందుకు ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని చేపట్టింది. పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ఆ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. దసరా సెలవుల తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది. బడికి వచ్చే సమయంలో ఏం తినకుండా వస్తున్నారని గుర్తించి ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టింది.


హైదరాబాద్‌ అమీర్‌పేట్‌ DKరోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని హోం మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులతోపాటు విద్యార్థులకు మేలు జరుగుంతుదని కేటీఆర్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ర్యావిలాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంత్రి హరీశ్‌రావుతో కలిసి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులకు స్వయంగా ఇడ్లి తినిపించారు.


ఖమ్మం రోటరీనగర్‌ కాలనీ జడ్పీ పాఠశాలలో మంత్రి పువ్వాడ అజయ్‌, హన్మకొండ లష్కర్‌బజార్ ప్రభుత్వ పాఠశాలలో సీఎం అల్పాహార విందు కార్యక్రమాన్నిమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా మగ్దుంపూర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, నిర్మల్‌ జిల్లా సోన్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి శ్రీకారంచుట్టారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు . ముఖ్యమంత్రి అల్పాహార కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలుపెట్టారు. ఈ పథకం ద్వారా 27వేల 147 పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతిచదివే దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలగనుందని ప్రభుత్వం తెలిపింది. ప్రతిరోజు పాఠశాల ప్రారంభానికి. 45 నిమిషాల ముందు అల్పాహారాన్ని వడ్డించనున్నారు.

సోమవారం ఇడ్లీ-సాంబరు లేదా గోధుమరవ్వ, మంగళవారం పూరీ, ఆలు కుర్మా లేదా టామటా బాత్, బుధవారం ఉప్మా-సాంబరు లేదా బియ్యం కిచిడి, గురువారం చిరు ధాన్యాలతో చేసే ఇడ్లీ-సాంబరు లేదా పొంగల్-సాంబరు, శుక్రవారం ఉగ్గాని, పోహా లేదా చిరుధాన్యాల ఇడ్లీ, శనివారం పొంగల్ సాంబరు లేదా కూరగాయలతో చేసిన పులావ్ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story