Ponguleti: ఫిబ్రవరి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రెవెన్యూ, సమాచార ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల 15న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని స్పష్టం చేశారు. వైరా కార్యకర్తల సమావేశంలో 'ఎన్నికలు వస్తున్నాయ్.. జాగ్రత్త' అంటూ కార్యకర్తలకు సూచించారు. కాగా.. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నత స్తాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చింది. ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామంటూ పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం అధికారులు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు.
కలెక్టర్‌కు ఫోన్ చేసిన మంత్రి
ఖరీ్‌ఫలో మిగిలిపోయిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని పలువురు కోరగా.. పొంగులేటి వెంటనే ఖమ్మం కలెక్టర్ ముజిమ్మిల్‌ఖాన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఖరీ్‌ఫలో మిగిలిపోయిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.కొంతమంది కాంగ్రెస్ నాయకులు సాదాబైనామా, ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సమయంలో పుణ్యపురం గ్రామానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు పెండింగ్లో ఉన్న సాదాబైనామా గురించి ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపైనా
పలువురు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కోసం అడగ్గా.. వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారికి ఇప్పుడు ఇల్లు కేటాయించబోమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇళ్ల కేటాయింపులో పేదలకు తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అంతకముందు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన భక్తరామదాసు జయంత్యుత్సవాల్లో పొంగులేటి పాల్గొన్నారు. భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించిన భక్త రామదాసు జన్మస్థలం నేలకొండపల్లిని తరతరాలు గుర్తుంచుకునేలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నేలకొండపల్లి ధ్యాన మందిర అభివృద్ధికి పదిరోజుల్లో రూ.2.65కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
రిజర్వేషన్లు పెంచిన తర్వాతే..
దేవరకొండ: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. దేవరకొండ పట్టణంలోని ఆదివారం బిసీ పొలిటికల్ జేఏసీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర కుల గణన చేపట్టిందని దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com