TG: కొండా సురేఖ వివాదం ముగిసింది: మంత్రి పొన్నం

TG:  కొండా సురేఖ  వివాదం ముగిసింది: మంత్రి పొన్నం
X
కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నప్పటికీ స్పందన ఎందుకు.. సంయమనం పాటించాలన్న పొన్నం

తన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నప్పటికీ సినీ పరిశ్రమకు చెందిన వారు ఇంకా స్పందిస్తూనే ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, ఆ వివాదం అంతటితో ముగిసిందని చెప్పారు. బలహీన వర్గానికి చెందిన మహిళా మంత్రి ఒంటరి అనుకోవద్దు.. కొండా సురేఖ విషయంలో సంయమనం పాటించాలి అని మంత్రి సూచించారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి హామీలను నెరవేరుస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో వరద నష్టం రూ. 10 వేల కోట్లు సంభవిస్తే.. కేంద్రం కేవలం రూ. 400 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. కొండా సురేఖ విషయంలో సంయమనం పాటించాల్సి ఉందన్నారు. కొండా సురేఖ ఒంటరిగా లేరని అన్నారు. మంత్రి వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాక స్పందించడం సరికాదన్నారు.

కొండా సురేఖకు రేవంత్ సర్కార్ ఝులక్

తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వివాదాలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా కొండా సురేఖకు కాంగ్రెస్ ప్రభుత్వం ఝులక్ ఇచ్చింది. కొండా దంపతులకు ప్రధాన అనుచరుడైన నవీన్ రాజ్‌కు ఉన్న ఇద్దరు గన్ మెన్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మంత్రి పేరు చెప్పుకుంటూ వరంగల్ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నవీన్ రాజ్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో ఇద్దరు గన్ మెన్లను వెనక్కి తీసుకుంది.

అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళా మంత్రి వ్యాఖ్యలపై అక్కినేని అమల కూడా ఘాటుగానే స్పందించారు. అయితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ - అమల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో సురేఖ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ స్పందించారు. తప్పనిసరిగా న్యాయం చేస్తామని అమలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

అసలేంటి ఈ వివాదం..

ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్ అన్నారు. దీనిపై మళ్లీ కొండా సురేఖ స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు.

Tags

Next Story