ఖమ్మంలో కొత్త బిచ్చగాళ్లు తయారయ్యారు: మంత్రి పువ్వాడ

ఖమ్మంలో కొత్త బిచ్చగాళ్లు తయారయ్యారు: మంత్రి పువ్వాడ
ఖమ్మం జిల్లా రాఘునాథపాలెం మండలంలోని రంక్యా తండాలో జరిగిన రైతు దినోత్సవంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు

ఖమ్మం జిల్లా రాఘునాథపాలెం మండలంలోని రంక్యా తండాలో జరిగిన రైతు దినోత్సవంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో కొంతమంది కొత్త బిచ్చగాళ్లు తయారయ్యారన్నారు.

ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో కొందరు కొత్త బిచ్చగాళ్లు ఖమ్మంలో తయారయ్యారంటూ విమర్శలు గుప్పించారు. 'సీఎం కేసీఆర్‌ను గద్దె దింపుతామని, తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరని' అంటున్నారని మంత్రి అజయ్‌కుమార్‌ మండిపడ్డారు. అలాంటి బిచ్చగాళ్లకు ప్రజలే సమాధానం చెప్పాలన్నారు. గిరిజనులు అండగా ఉన్నంత వరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ మంత్రి సవాల్‌ విసిరారు.

Tags

Next Story