ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణ హైకోర్టులో విచారణ
X

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయకుండా కేవలం మెమో దాఖలు చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. రమేష్ పౌరసత్వంపై పూర్తి వివరాలు తెలుసుకుని కౌంటర్ అఫిడవిట్ వేయాలని నవంబర్ 18న కేంద్ర హోంశాఖను ఆదేశించింది. అయితే నేటి విచారణలో ఈ ఏడాది ఫిబ్రవరిలో చెన్నమమేని రమేష్ కి జర్మనీ పౌరసత్వం ఉందని ఇచ్చిన మెమోనే మళ్లీ దాఖలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. చివరి అవకాశం ఇస్తున్నామని.. వెంటనే జర్మనీ ఎంబసీ నుంచి పూర్తి వివరాలు తీసుకుని అఫిడవిట్ వేయాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీచేసింది.



Tags

Next Story