LASYA: కారు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యనందిత కన్నుమూత

LASYA: కారు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యనందిత కన్నుమూత
పటాన్ చెరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.... దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు..

దివంగతనేత సాయన్న కుమార్తె, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్ చెరు సమీపంలో ORRపై అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే PAతో పాటు డ్రైవర్ కు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ నార్కట్ పల్లి వద్ద లాస్యనందిత కారు ప్రమాదానికి గురైంది. గతేడాది ఫిబ్రవరిలో లాస్యనందిత తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతిచెందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రీకుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్యనందిత ఎన్నికయ్యారు. ఆమె మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ , KTR, హరీశ్ రావు సహా పలువురు రాజకీయప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్యనందిత... రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం బాధాకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారకు. కష్టకాలంలో నందిత కుటుంబానికి భారాస అండగా ఉంటుందన్న ఆయన.... ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణ వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.


సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న సీఎం రేవంత్ రెడ్డి... నందిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లాస్య నందిత మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. లాస్య మృతి పట్ల...మాజీ మంత్రి హరీశ్ రావు, భారాస ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులో లాస్య అకాల మరణం బాధకరమన్న భట్టి విక్రమార్క...లాస్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య నందిత మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లాస్య నందిత మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్న భారాస ఎమ్మెల్సీ కవిత, ….ప్రజాసేవకు అంకితమైన నందిత అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు. లాస్య నందిద ఆకస్మిక మరణం అత్యంత విషాదకరమన్న మంత్రి జూపల్లి....ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. లాస్య నందిత మృతి పట్ల...భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story