హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బ్యాలెట్‌ బాక్సులను తెరిచిన అధికారులు.. బ్యాలెట్ బాక్సుల్లోని పత్రాలను 25 చొప్పున కట్టగా కడుతున్నారు. కౌంటింగ్‌ కోసం 8 హాళ్లు కేటాయించారు. ఒక్కో హాల్‌లో 7 టేబుళ్ల చొప్పున మొత్తం 56 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున పంపిణీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తరువాతనే మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.

తొలుత రిటర్నింగ్ అధికారులు, ఏజెంట్ల సమక్షంలో చెల్లనివి, చెల్లే ఓట్లను వేరు చేస్తారు. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడంతో పాటు పోలింగ్ కూడా భారీగా జరగడంతో ఫలితాలు వెలువడేందుకు ఒకట్టిన్నర నుంచి రెండు రోజుల వరకు పడుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం మూడు జిల్లాల పరిధిలోని 731 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ హాళ్లకు తరలించారు.


Tags

Read MoreRead Less
Next Story